సమంత – దర్శకుడు రాజ్ నిడిమొరుకు వివాహం… సినీ వర్గాల్లో సంచలనం
సినీ పరిశ్రమను ఆశ్చర్యపరిచే విధంగా ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు దర్శకుడు–నిర్మాత రాజ్ నిడిమొరు (రాజ్ & DK ఫేమ్) అత్యంత గోప్యంగా పెళ్లి చేసుకున్నారు — ఈ వివాహం ఇషా యోగ సెంటర్ , కోయింబత్తూర్ లోని లింగ భైరవి టెంపుల్ వద్ద జరిగింది. కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుక ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
సమంత, ఇటీవల ఆరోగ్య సమస్యల నుండి కోలుకుని తిరిగి సినిమాలకు దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇక రాజ్ నిడిమొరు, ది ఫ్యామిలీ మాన్, గన్స్ & గులాబ్స్ వంటి సూపర్‌హిట్ వెబ్ సిరీస్‌లతో జాతీయస్థాయిలో పేరుపొందారు.
సమంత–రాజ్ నిడిమొరుల బంధంపై చాలా కాలంగా రూమర్స్ ఉన్నప్పటికీ, అధికారికంగా ఇద్దరూ స్పందించలేదు. తాజాగా జరిగిన ఈ వివాహం ఆ వార్తలకు మరింత బలం చేకూర్చింది. వేడుకలో హాజరైన అతిథులు ఈ వివాహం చాలా సింపుల్‌గా, ఆత్మీయంగా జరిగినట్టు తెలిపారు.
ఇద్దరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద సంఖ్యలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
