మన బాపట్ల మహనీయుడు - పేరం గరుడాచలం నాయుడు-.. తరాలు మారిన చెరిగిపోని ఒక మహా త్యాగ స్మరణ !
మన బాపట్ల మహనీయుడు - పేరం గరుడాచలం నాయుడు. ఇది వ్యక్తి ఆరాధన కాదు..
సుమారు వందేళ్ళ క్రితం మాట ఇది. అప్పట్లో కార్లు లేవు, బస్సులు లేవు. ఎక్కడికైనా వెళ్లాలంటే కాలి నడకనో, ఎడ్ల బండి మీదో వెళ్ళాలి. అలా బాపట్ల మీదుగా వెళ్ళే బాటసారులు ఆకలితో అలమటించడం, అలసిపోయి రోడ్ల పక్కన పడుకోవడం చూసి ఆ మహాతల్లి బిడ్డ మనసు చలించిపోయింది.
"నా ఊరు వచ్చే ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదు, అలసిపోకూడదు" అని సంకల్పించుకున్నారు. అందుకే స్థాపించారు.. "తూర్పు సత్రం" (Torpu Satram).
అంతేకాదు.. హిందూ ధర్మంలో మనిషి చనిపోయాక జరిపే కర్మకాండలకు ఎంతో పవిత్రత ఉంటుంది. పేదవాళ్ళు తమ పెద్దలకు ఆ క్రియలు జరుపుకోవడానికి స్థలం లేక ఇబ్బంది పడుతుంటే.. వారి కన్నీళ్లు తుడవడానికి ఈ సత్రాన్ని వేదికగా మార్చారు.
కేవలం సత్రం కట్టి ఊరుకోలేదు. అది ఎప్పటికీ నడవాలి, పేదవాడికి ఉచితంగా అన్నం దొరకాలి అని.. తన కష్టార్జితం అయిన సుమారు 92 ఎకరాల భూమిని రాసిచ్చిన దానకర్ణుడాయన! ఈ రోజుల్లో పది గజాల స్థలం కోసం కొట్టుకు చస్తున్నాం మనం.. అలాంటిది 92 ఎకరాలు సమాజానికి ఇచ్చారంటే ఆయనది ఎంత గొప్ప మనసు?
కానీ సోదరులారా.. ఈ రోజు పరిస్థితి ఏంటి?
ఆయన అంత గొప్ప మనసుతో ఇచ్చిన ఆస్తి, ఇప్పుడు కళ్ళ ముందే కరిగిపోతోంది. ఒకప్పుడు 92 ఎకరాలు ఉన్న ఆస్తిలో.. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల, ఆక్రమణదారుల పాపం వల్ల.. నేడు మిగిలింది కేవలం 5 నుండి 6 ఎకరాలు మాత్రమే!
మిగిలిన ఆ కొద్దిపాటి స్థలాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. అది కేవలం ప్రజా సేవకే ఉపయోగపడాలి.
ఇన్నాళ్లకు ఆ మహనీయుడికి సరైన గుర్తింపు దక్కబోతోంది!
విన్నపం:
ఈ మంచి పని త్వరగా కార్యరూపం దాల్చాలి. ఆ సర్కిల్ అభివృద్ధి ద్వారా, భావితరాలకు ఆయన త్యాగం తెలియాలి. అలాగే, మిగిలిన సత్రం భూములు కూడా అన్యాక్రాంతం కాకుండా, పేద ప్రజల సేవకే ఉపయోగపడేలా చూడాలని కోరుకుంటున్నాం.
---------> Palanki Siva Sai Babu <----------------
