సమాజ సేవకు ప్రతిరూపం — అన్నం సతీష్ ప్రభాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు
బీజేపీ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ గారు రాజకీయ నాయకుడిగానే కాదు, సేవామూర్తిగా ప్రజల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు.
పదవి ఉన్నా లేకున్నా సమాజం కోసం ఎల్లప్పుడూ ముందుండే ఆయన నిబద్ధత ఇతర నాయకుల నుంచి ఆయనను ప్రత్యేకంగా నిలబెడుతోంది.
మాటల కంటే పనులు గొప్పవని చూపిస్తూ ప్రజల్లో నమ్మకం గెలుచుకున్న నాయకుడు ఆయన.
బాపట్ల భావన్నారాయణ స్వామి వారి రధం తయారీకి 15 లక్షలు పైగ విరాళాలు అందచేశారు. అంతే కాకుండా చాల టెంపుల్స్ కి నిత్యం తన సహాయ సహకారాలు అందిస్తూనే వున్నారు. దేవాలయాల నిర్మాణం, పునరుద్ధరణలో ఆయన చేస్తున్న కృషి అనేక ప్రాంతాల్లో భక్తి వాతావరణాన్ని పెంపొందిస్తుంది.
ప్రతి సంవత్సరం పేద పిల్లల విద్యాభివృద్ధి కోసం అందిస్తున్న స్కాలర్షిప్‌లు, విద్యా సహాయాలు ఎన్నో కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నాయి.
అయన చేస్తున్న అన్నదాన కార్యక్రమాలు, అయ్యప్ప భక్తులకు సద్ది వంటివి అయన చేస్తున్న సేవ కార్యక్రామాలకు చక్కని నిదర్శనం.
.
గ్రామీణ ప్రాంతాల్లో పండుగల సమయంలో ఎడ్ల పందాలు నిర్వహించి రైతులను చక్కటి బహుమతులు గెలుచుకోవటంలో ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. ఆధ్యాత్మికత, సంస్కృతి పరిరక్షణలో ఆయన పాత్ర అపారమైనది. గ్రామాల అభివృద్ధికి శుద్ధి నీటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం ఆయన ప్రధాన కృషిలో ఒకటి.
వైద్య శిబిరాలు, ఆరోగ్య సేవలు అందించి అనేక కుటుంబాలకు ఉపశమనం కలిగించారు. వృద్ధులకు, దివ్యాంగులకు అవసరమైన సామగ్రి అందజేస్తూ మానవత్వాన్ని ప్రతిబింబించారు.
సహజ విపత్తుల సమయంలో ఆయన అందించిన సహాయం బాధితులకు అండగా నిలిచింది.
మన బాపట్ల నియోజక వర్గంలో యాజలి - దమ్మన్నవారి పాలెంలో అయన స్థాపించిన అన్నం ఫుడ్ పార్క్ వల్ల దాపుగా 2000 కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించబడ్డాయి అవి ఎంతగానో గ్రామీణ ప్రాంత స్థానిక యువతకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
ప్రతీ చర్యలో ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేయడం ఆయన ప్రత్యేకత. సమాజం పట్ల ఉన్న ప్రేమ, సేవాభావం ఆయన వ్యక్తిత్వానికి మూలం. అధికారాన్ని బాధ్యతగా చూసే నాయకత్వం ఆయనకు ప్రజాదరణ తెచ్చింది.
