ఆత్మీయ న్యూజెర్సీ టీమ్ అద్వర్యం లో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్' రిలీజ్ సెలబ్రేషన్స్
ఆత్మీయ & మెగా అభిమానుల ఆధ్వర్యంలో ‘మన శంకర వరప్రసాద్’ చిత్రం విడుదలను పురస్కరించుకుని నిర్వహించిన రిలీజ్ సెలబ్రేషన్ ఈవెంట్ న్యూజెర్సీ రాష్ట్రంలోని నార్త్ బ్రన్స్విక్ రీగల్ థియేటర్‌లో అద్భుతంగా జరిగింది. అభిమానుల కేరింతలు, హర్షధ్వానాలు, ఉత్సాహభరిత నినాదాల నడుమ ఈ కార్యక్రమం ఘనంగా సాగింది.
ఈ సందర్భంగా అభిమానులు కేక్ కట్ చేసి మెగాస్టార్ చిరంజీవి గారిపై తమ అపారమైన అభిమానాన్ని చాటుకున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వయసుతో సంబంధం లేకుండా చిరంజీవి గారి అభిమానులు హుక్ స్టెప్స్ వేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. థియేటర్ ప్రాంగణం మొత్తం పండుగ వాతావరణాన్ని తలపించింది.
ఈ కార్యక్రమంలో ఆత్మీయ ఎంపైర్ చాప్టర్ ప్రెసిడెంట్ రంగనాధ్ గంట, ఆత్మీయ మీడియా & కమ్యూనికేషన్స్ చైర్ వంశీ పసుపులేటి, ఆత్మీయ ఇమిగ్రేషన్ వైస్ చైర్ కుమార్ రావూరి, ఆత్మీయ మెంబర్షిప్ కోఆర్డినేటర్ సత్యకృష్ణ వీర, ఆత్మీయ సభ్యులు రాజేష్ ఎర్రపోతు, శివ బోనాల తదితర సభ్యులు, పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. చుట్టు పక్కల వారికి ఇబ్బంది కలగకుండా కేక్ కటింగ్ వేడుక తర్వాత థియేటర్ బయట ప్రాంగణం శుభ్రం చేసి, పర్యావరణం సురక్షితంగా ఉండేలా తమ బాధ్యతను చాటుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ‘మన శంకర వరప్రసాద్’ చిత్రం ఘన విజయం సాధించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని, భవిష్యత్తులో కూడా మెగాస్టార్ చిత్రాలకు ఇలాంటి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
