Loading...

చెన్నై లోని అన్నై ఫాతిమా అనాధాశ్రమంలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

చెన్నై, సెప్టెంబర్ 2, 2026:  పవర్ స్టార్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని, శోళింగనల్లూరు పరిసర ప్రాంతాల్లోని PG యజమానులు మరియు OMR రోడ్డులో నివసిస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులు కలిసి ఒక గొప్ప సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. 

కారపాక్కంలోని అన్నై ఫాతిమా చైల్డ్ వెల్ఫేర్ సెంటర్లోని అనాథ బాలలు, వృద్ధుల కోసం ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆప్యాయతతో నిర్వహించారు. జన్మదిన వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా, అవసరమైన వారికి సహాయం అందిస్తూ మానవతా విలువలను చాటుకోవాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా బ్రెడ్‌లు, పండ్లు, సరుకులు , రుచికరమైన విందు భోజనాన్ని అనాథ బాలలు, వృద్ధులకు ప్రేమతో పంపిణీ చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన కేక్‌ను కట్ చేసి, అక్కడి పిల్లలు, వృద్ధులతో కలిసి అభిమానులు ఆనందాన్ని పంచుకున్నారు. 

సుమారు 300 మందికి భోజనం అందించడం ద్వారా ఈ కార్యక్రమం సేవా స్ఫూర్తికి ప్రతీకగా నిలిచింది. 

అనాథ బాలల ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు ఈ సందర్భంగా అన్నై ఫాతిమా చైల్డ్ వెల్ఫేర్ సెంటర్‌లోని అనాథ బాలలు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు ఆయురారోగ్యాలు, సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం కలగాలని ఆకాంక్షించారు. 

భవిష్యత్‌లో ఆయన సినిమాల్లో మరింత విజయాలు సాధించాలని, రాజకీయ ప్రయాణంలో కూడా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకున్నారు. అంతేకాకుండా, ప్రజలకు మరింత సేవ చేస్తూ కోట్లాది మంది అభిమానులకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షిస్తూ, “ఒక రోజు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మమ్మల్ని సందర్శించి, మాతో కొంత సమయం గడపాలని కోరుకుంటున్నాం” అని తమ మనసులోని కోరికను వ్యక్తం చేశారు. 

102 ఏళ్ల వృద్ధ మహిళ ఆశీర్వాదం – వేడుకలో ప్రత్యేక ఘట్టం ఈ కార్యక్రమంలో 102 ఏళ్ల వృద్ధ మహిళ పవన్ కళ్యాణ్ గారికి స్వయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, ఆయన ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆశీర్వదించడం అందరి హృదయాలను హత్తుకున్న ప్రత్యేక క్షణంగా నిలిచింది. 

పవన్ కళ్యాణ్ గారు ఎల్లప్పుడూ ప్రజల కోసం పనిచేస్తూ, మంచి ఆరోగ్యంతో మరింత కాలం ప్రజలకు సేవ చేయాలని అందరూ ఆకాంక్షించారు. అభిమాని తన అభిమాన నటుడి జన్మదినాన్ని జరుపుకోవడం మాత్రమే కాదు… ఆ ఆనందాన్ని అవసరంలో ఉన్న వారితో పంచుకోవడమే నిజమైన అభిమానం. 

        “మానవ సేవే మాధవ సేవ" అని రుజువు చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులు