Loading...

కోనసీమకు దిష్టి తగిలిందన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరించిన కొంత మంది నాయకులు

ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు కోనసీమ పర్యటనలో తుఫానుకు  అతలాకుతలమైన రైతాంగంకి ముఖ్యంగా కొబ్బరి రైతులకు భరోసా కల్పించే క్రమంలో, "కోనసీమ అందాలు, ప్రశాంతత, కొబ్బరి చెట్లతో ఎంతో ఆహ్లాదంగా కనిపించే గోదావరి పచ్చదనాన్ని గురించి తెలంగాణా నాయకులు పదేపదే ప్రస్తావించి, ఇలాంటి అందాలు కలిగిన ప్రాంతంగా తెలంగాణాని కూడా తయారు చేసుకోవాలి అని అంటువుండే వారు, మరి ఎవరి దృష్టి తగిలిందో ఏమో గాని కోనసీమ అందాలకు తలమానికమైన కొబ్బరి చెట్లు తలలు లేని మొండాలుగా దర్శనమిస్తున్నాయి"

ఇదే కదా పవన్ గారు అన్నది! ?

ఇందులో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే మాట ఒక్కటైనా ఉందా?..

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం  అంటే ఎంటో చెప్పనా..

అసెంబ్లీ లో జయప్రకాష్ నారాయణ గారిని చెంపమీద కొట్టడం, ఆంధ్రా వాసుల మలమూత్ర విసర్జాలతో ట్యాంక్ బండ్ దుర్వాసనకు గురవుతుంది అనడం, ఆసుద్దాలను కూడా ప్రాంతాలుగా విడదీసి ఆపాదించడం, వీరి మలమూత్రాలు సుగంధ పరిమళాలు వెదజల్లు తాయనుకుంటారు కాబోలు, ట్యాంక్ బండ్ మీద ఉన్న బ్రహ్మనాయుడు విగ్రహాన్ని ధ్వంసం చేయడం,
ఆంధ్రుల ఆహారంలో భాగంగా ఉన్న ఉలవచారును తెలంగాణలో గేదెలకు, దున్నపోతులకు పెడతారు అని హేళనగా అన్నప్పుడు, ఆంధ్రా వాళ్ళు చేసే బిర్యానిని పేడతో పోల్చినప్పుడు, యజ్ఞ యాగాలు చేసే సమయంలో ఆంధ్రా ప్రాంత పండితులను సంస్కార హీనమైన  పదజాలంతో వారి ఆహారాన్ని, వేషధారణని కించపరిచే విధంగా మాట్లాడడం, ఇలాంటి మాటలుకదా ప్రాంతీయ ద్వేషాలు రెచ్చగొట్టడం అంటే, ఆ యా సమయాలలో ఆంధ్రా వాసులు సంయమనం పాటించారు గనుకనే మీ మనుగడ సాగింది.

మధ్య ఒక మార్వాడి ఒక తెలంగాణ వ్యక్తుల మధ్య జరిగిన కోట్లటను ఆసరాగా తీసుకుని మార్వాడీలు తెలంగాణ వదలి వెళ్లిపోవాలని అహంకార పూరిత ధోరణిలో గొడవకి దిగారు.

పవన్ కళ్యాణ్ గారు విధ్వంసకర రాజకీయాలు ఏనాడు చేయడు, ప్రాంతీయ వాదికాడు, దేశసమగ్రత కోసం దేశ భక్తిని, పోరాట వీరుల స్ఫూర్తిని నరనరాల్లో నింపుకుని అహర్నిశలు అందరూ బాగుండాలని కోరుకుని ప్రజలకోసమే పోరాడే నిస్వార్థ సమర యోధుడు, ఇలాంటి వారు చాలా చాలా అరుదుగా పుడతారు

మీ తాటాకు చప్పుళ్లకు అదరడు బెదరడు...  ఇప్పుడు మాట్లాడుతున్న మీ కిందవున్న మచ్చల సంగతి ముందు చూసుకోండి.. నీతి నిజాయితీలకు మారుపేరైన వ్యక్తిని వ్యక్తిత్వ హననం తరువాత చెద్దురు గాని. 

జైహింద్ 
చంద్ర మోహన్. జక్కా