Loading...

తను చేసిన పాత్రలకు వన్నె తెచ్చిన నటుడు , విశ్వనట చక్రవర్తి SV రంగారావు గారి జయంతి నేడు (జులై 3)

తెలుగు సినీ ప్రపంచం అనగానే మేధావులు గుర్తు చేసుకునే తొలి పేరుల్లో ఒకటి – శ్రీ సామర్ల వెంకట రంగా రావు గారు (SVR). ఆయనను అభిమానులు ప్రేమగా "విశ్వ నట చక్రవర్తి" అని పిలుచుకుంటారు. చిన్న మాటలతో గొప్ప పాత్రను తీర్చిదిద్దగల నటా మేధావి. తన అరుపుతో కాక, అంతర్లీన భావంతో ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన నటుడు.
"పాండవ వనవాసం" చిత్రంలో శ్వృ గారి చిన్న డైలాగ్ — "పో పొన్నిమ్ము బానిస బతుకులు"  ఈ ఒక్క మాటతో, ముఖ కవళికలతో, కనుబొమ్మల ద్వారా ఆయన ఇచ్చిన అభినయం, NTR గారి దీర్ఘ డైలాగ్‌ను కూడా మించిపోయిందన్న అభిమానుల అభిప్రాయం.

"మాయాబజార్" లో ఘటోత్కచుడి పాత్రలో ఆయన జీవించి నటించారు. కేవలం హాస్యం కాకుండా, పాత్రలో జీవించే కళాకారుడిగా గుర్తింపు.

"పాతాళ భైరవి" లో నెపాళి మాంత్రికుడి పాత్రతో ప్రజాదరణ. "నర్తనశాల" లో కీచకుడిగా నటించి, జాకార్త ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు పొందడం ద్వారా భారత నటనకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చారు.

ఇలా ప్రతి పాత్రను ఆత్మలో తేలికగా ఒదిగించుకొని నటించిన SVR గారు...ప్రతి మాటలో, ప్రతి చూపులో, ప్రతి అభినయంలో జీవితం పోసే వ్యక్తిత్వం.

భావనతో పలికిన వాక్యాలు – సమాజాన్ని తాకిన ప్రభావం…  తనకెంత పదాలు లేకున్నా – భావం జయించింది,  SVR… "విశ్వ నట చక్రవర్తి" – హృదయాలకి చిరకాల తారం…
ఆయన నటించిన సినిమాలే కాదు, జీవించిన పాత్రలు…సర్వభౌమ నటసామ్రాట్‌కు తెలుగు చలనచిత్ర రంగం తరఫున శత శత నమస్సులు.

Article By - సురేష్ కరోతు (Atlanta, USA)