తిరుమల శ్రీవారికి అష్టలక్ష్మీ చంద్రవంక కంఠి విరాళం
తెలంగాణ ఎంపీ శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు రూ.60 లక్షల విలువైన 535 గ్రాముల అష్టలక్ష్మీ చంద్రవంక కంఠిని శ్రీ వేంకటేశ్వర స్వామివారికి మంగళవారం సమర్పించారు.
రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ మరియు అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి గారితో కలిసి ఆభరణాన్ని స్వీకరించారు..
